సంగారెడ్డి, మే 14 :సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆయా పనులకు అధికారికంగా భూమిపూజ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రంలోని బైపాస్ రోడ్డు ప్రభు త్వ అతిథిగృహం నుంచి బసవేశ్వర విగ్రహం వర కు 2.6 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి నాలుగు లైన్లు నాలుగు జంక్షన్లతో అభివృద్ధి చేయనున్నారు.
పోతిరెడ్డిపల్లి రైతువేదిక 65వ జాతీయ రహదారి నుంచి శిల్ప వెంచర్ వెనుక నుంచి కంది మండలం కలివేముల భూలక్ష్మమ్మ ఆలయం వరకు 60ఫీట్ల వెడల్పుతో కొత్త రోడ్డును నిర్మించనున్నారు. దీంతో పాటు ఆర్అండ్బీ శాఖలో 15 కిలోమీటర్ల రెండు రోడ్లకు రూ.30కోట్ల, పంచాయతీరాజ్ విభాగంలో 6 రోడ్లు 26.3కిలోమీటర్ల రోడ్లకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. సంగారెడ్డి నియోజకవర్గం లో రోడ్ల అభివృద్ధికి రూ.81.3 కోట్లు నిధులు మం జూరైనట్లు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషిచేస్తున్నారు.
రాజీవ్‌పార్కుకు రూ.12 కోట్లు..
సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్‌పార్కు అభివృద్ధ్దికి ప్రభుత్వం నుంచి రూ.12కోట్లను మంజూరు చేసింది. త్వరలో నిర్మాణ పనులకు టెండర్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్అండ్బీ శాఖలో కొండాపూర్ మండలం మల్లేపల్లి నుంచి వయా చెర్ల గోపులారం చెరువు కట్ట వెడల్పుతోపాటు తేర్పోల్, హరిదాస్పూర్ వరకు 7 కిలోమీటర్ల రోడ్డును డబుల్ లైన్‌గా మార్చడానికి రూ.15కోట్లు మంజూరయ్యాయి. సదాశివపేట మండలం తంగేడుపలి-మల్లారెడ్డిపేట్ రోడ్, వయి మద్దికుంట, ఆత్మకూర్ వరకు 8 కిలో మీటర్ల రోడ్డును డబుల్ లేన్‌గా మార్చేందుకు రూ.15కోట్ల నిధులు ఖర్చుచేయనున్నారు.
పీఆర్లో 26.3 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధ్ది…
సంగారెడ్డి నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ విభాగంలో కొనసాగుతున్న రోడ్లను అభివృద్ధి చేసేందుకు 26.3కిలోమీటర్ల రోడ్ల్లకు రూ.22.85 కోట్లను ఖర్చుచేయనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రయను అధికారులు చేపట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. కొండాపూర్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వయా ఆలియాబాద్- గారకుర్తి గ్రామాల నుంచి సదాశివపేట వరకు 9కిలోమీటర్ల రోడ్డుకు రూ.10కోట్లతో చేపట్టనున్నారు.
కంది మండలం కలివేముల నుంచి మక్తఅల్లూరు వరకు 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.80కోట్లు నిధులు మంజూరయ్యాయి. అదే మండలంలోని చిమ్నాపూర్ నుంచి చిమ్నాపూర్ తండా వరకు 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.34కోట్లు, బైపాస్ రోడ్డు నుంచి మహమ్మద్ షాపూర్ తండా వరకు 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.85కోట్లు, కొండాపూర్ మండలం మారేపల్లి పీడబ్ల్యూడీ రోడ్డు వయా రామ్‌పూర్ తండా, గోటిలగుట్ట తండా మాచేపల్లి నుంచి సీతారాంకుంట తండా వరకు 3.8కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులకు రూ.2.65కోట్లు, సదాశివపేట మండలం ఆత్మకూర్ నుంచి వయా బొబ్బిలిగామ, ఏటిగడ్డ సంగం, మలాపాడ్ గ్రామాల మీదుగా సింగూర్ ప్రాజెక్టు వరకు 7.5కిలోమీటర్ల రోడ్డుకు రూ.5.2కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.