రామయంపేట, ఫిబ్రవరి 23 : రామాయంపేట మున్సిపల్ పట్టణ వాసులు, గిరిజన తండా వాసులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తనకు ఫోన్ గాని లేక మీకు అందుబాటులో ఉండే కౌన్సిలర్, సిబ్బందికి గాని వెంటనే తెలుపాలని సూచించారు. బుధవారం రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గిరిజన తండాలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలనీలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయి ఉంటే వెంటనే తనకు ఫోన్ చేయాలన్నారు. రోడ్లపై చెత్తా చెదారం లేకుండా ప్రతిరోజూ కార్మికులతో శుభ్రం చేయిస్తానన్నారు. పాఠశాల లో టీచర్లు శుభ్రత పాటిస్తూ, విద్యర్థులకు నాణ్యమైన విద్యానందించాలన్నారు. చైర్మన్ వెంట కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.