
పెద్దశంకరంపేట,డిసెంబర్21 : ఆటో బైక్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారు 161వ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన సాయిలు (28) జోగిపేట నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా.. కోళ్లపల్లి గ్రామ శివారులో కోళ్లపల్లి వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో సాయిలు మృతి చెందాడన్నారు.
కోళ్లపల్లి గ్రామానికి చెందిన చాకలి రవీందర్‌కు కూడా త్రీ గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.