తెలంగాణ అవతరణ వేడుకను జిల్లా ప్రజలు గుండెలనిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఆదివారం ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టరేట్లో కలెక్టర్ మనుచౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు వైభవంగా వేడుకలు నిర్వహించారు. ప్రతిచోటా జై తెలంగాణ, జయహో తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.