చేగుంట, అక్టోబర్ 30: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా చేగుంట, నార్సింగి మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. గాంధీ చౌరసా నిరసన తెలిపి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీ సీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ల ఫొరం మండల అధ్యక్షుడు మంచిక్ల శ్రీనివాస్, నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానీషా, వడ్డెపల్లి నర్సింహులు, అంజిరెడ్డి, లోక్శ్రెడ్డి, అలీ, తీగుల్ల శ్రీనివాస్, నరేశ్, బక్కి రమేశ్, గణేశ్, గాండ్ల నందం, ఎర్ర యాదగిరి, నదీం, సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, అన్నం రవి, భాగ్యరాజ్, సండ్రుగు రవి ఉన్నారు. నార్సింగిలో నిర్వహించిన నిరసనలో బీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు మైలరాం బాబు, అంచనూరి రాజేశ్, శంకర్‌గౌడ్, ఎంపీపీ చిందం సబీత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి ఉన్నారు.