సంగారెడ్డి, సెప్టెంబరు 20 : సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాన్ని అలవర్చుకున్నారు. డ్రైవర్, మెకానిక్‌తో వచ్చే డబ్బులు సరిపోవడం లేదని దొంగతనంతో అయితే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని నిర్ణయించుకున్నారు. సోమవారం పటాన్ చెరులో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు. మంగళవారం సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర రాష్ర్టాలకు చెందిన కొందరు వ్యక్తులని పట్టుకుని విచారించగా దొంగతనం విషయాలు బయటపడ్డాయన్నారు. మొదటగా చర్లపల్లిలోని ట్రా లీ ఆటో, ఏటీఎం చోరీకి యత్నించి విఫలమయ్యారు. జూలై 8న పటాన్చెరు మండలంలోని భానూర్ హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో రూ. 24 లక్షలను లోడ్ చేశారు. అదే రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కట్ చేసి రూ.15.70లక్షలను దొంగిలించారు. ఈ ఘటనపై తగిన చర్య లు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఫిర్యాదు దారుడు ‘క్లియర్ సెక్యూర్డ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ రీజినల్ మేనేజర్ మైత్రిసన్నిహిత్ బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారింభించారు.
దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు హర్యా నా, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించి వారిపై నిఘా పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారని వివరించా రు. దొరికిన వారిలో ఇద్దరు పటాన్చెరు ప్రాంతంలో జేసీబీ డ్రైవర్లుగా తాలిమ్, లియాకత్ పని చేస్తున్నారు. వారికి తోడు గా రాహుల్ ఖాన్, సలీంఖాన్, జాకీర్‌ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, శరీఫ్ జేసీబీ మెకానిక్‌లుగా పనిచేస్తున ట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు సులభంగా డబ్బులు సంపాదించాలని జూన్ నెలలో కాటేదాన్‌లో ఒక మినీ ట్రాలీ, చర్లపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనాలు చేసి విఫలమయ్యారు. పక్కాప్లాన్‌తో జూలై నెలలో తాలిమ్ఖాన్, లియాఖత్ఖాన్ సలహా తో భానూర్ని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో దొంగతనం చేయాలని ముందుగా పాటి చౌరస్తాలో ఒక మినీ ట్రాలీని దొంగలించి ఈ ట్రాలీలో గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సి లిండర్, కత్తి, బొమ్మ పిస్టల్, బ్లాక్ స్ప్రేలతో భానూర్ హెచ్డీఎఫ్సీ ఏటీఎంకు చేరుకుని దొంగతనం చేశారు. ఈ నెల 19న పటాన్చెరు ప్రాంతంలో దొంగతనానికి ప్రయత్నించి తిరిగి ఇంటికి వెళుతుండగా పోలీసులు వారిని పట్టుకుని వారి నుం చి దొంగతనానికి ఉపయోగించే వస్తువులను రికవరీ చేసుకుని ఎస్పీ ఎదుట హాజరుపర్చారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉషావిశ్వనాథ్, సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.