Rayapole | రాయపోల్‌లో అట్టహాసంగా ముగిసిన అస్మిత మహిళల ఖోఖో ఖేలోఇండియా
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ) నందు ఖేలోఇండియా అస్మిత ఖోఖో సిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఘనంగా ముగిసాయి.
Rayapole | రాయపోల్, అక్టోబర్ 1 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ) నందు ఖేలోఇండియా అస్మిత ఖోఖో సిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఘనంగా ముగిసాయి. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని బాలిక క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల అనంతరం ముగింపు కార్యక్రమం పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మర్మాముల నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్ కృష్ణమూర్తి మాట్లాడారు. ఆటలు దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటిచెప్పుతాయని, అందుకే కేలోఇండియాలో భాగంగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని యువత క్రీడా రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం నాగరాజు మాట్లాడుతూ అస్మిత ఖేలో ఇండియా ఆటలు మంచి గుర్తింపుతో పాటు స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేక సీట్లను ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెదక్ జిల్లా డిస్టిక్ ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పీ రామేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, టీ నర్సింగరావు, ఎంఎస్పీ సీనియర్ క్రీడాకారులు యూ స్వామి, బీ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ హరికృష్ణ పాల్గొనగా రాయపోల్ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాయిని గోవర్ధన్ రెడ్డి, ఎన్ఐఎస్ కోచ్ మల్లేష్, మధు, బిందు, సాగర్, యాదగిరి, అనిల్, అశ్వినీ, రాయపోల్ గ్రామ సీనియర్ క్రీడాకారులు పాల్గొని విజయవంతంగా క్రీడాఅంశాలను పూర్తి చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

