కొమురవెల్లి, ఫిబ్రవరి 8 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల గ్రామంలోని సాంద్రానంద స్వామి ఆశ్రయం ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఆశ్రమ నిర్వాహకులు గౌరిభట్ల శ్రీనాథశర్మ ఆధ్వర్యంలో ఎన్నో యాగాలు,పూజలు, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో త్రిమూర్తి స్వరూపంగా కొలువైన సాంద్రానంద స్వామి, సర్వ విద్యల ప్రదాత విద్యా హాయగ్రీవస్వామి, త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయ స్వామి, జ్ఞానమూర్తిగా దక్షిణామూర్తి, త్రిశక్తి స్వరూపంగా రాజరాజేశ్వరీదేవి కొలువైన ఉన్నారు. ఈనెల 11 ఆదివారం నుంచి 14 వరకు సాంద్రానంద ఘనస్వరూప నృహింహ స్వామి ఆశ్రమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా, భారీగా భక్తులు రానున్నారు. ఈ సందర్భంగా మహారుద్ర యాగం నిర్వహిస్తారు.
మర్రిముచ్చాలలోని సాంద్రానంద ఆశ్రమం లో సాంద్రానంద ఘనస్వరూప నృసింహ వార్షికోత్సవాలు కనుల పం డువగా నిర్వహిస్తాం. ఈ వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అన్నదానం నిర్వహిస్తాం. లోకకల్యాణం కోసం ఏటా స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఏటా భక్తుల తాకిడి పెరుగుతున్నది.