రామచంద్రాపురం, ఫిబ్రవరి18: బస్సుల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఏసీపీ నర్సింహరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నంలోని మల్లేపల్లి మంగర్ బస్తీలో నివాసం ఉండే ఉప్పాడే సంతోశ్, రాజేశ్, మల్లేశంతో కలిసి బస్సుల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. 2021లో సంతోశ్ లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి అరస్టై, చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత సంతోశ్, రాజేశ్, మల్లేశంతో కలిసి ఆర్సీపురంలో నాలుగు స్నాచింగ్‌లు, చందానగర్, మియాపూర్ పీఎస్‌ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున మొత్తం ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను మల్లేపల్లికి చెందిన పూజ కాంబ్లీకి అమ్ముకుంటారు. నిందితులు ముగ్గురు మల్లేపల్లిలో పటాన్చెరు బస్సు ఎక్కి ఎవరి మెడలో బంగారు గొలుసులు ఉన్నాయో గమనిస్తారు. ఒకరిని ఎంచుకుని వారు బస్సు దిగే క్రమంలో వారి ముందు ఇద్దరు, వెనుకల నుంచి ఒక్కడు వచ్చి బస్సు దిగనివ్వకుండా చేసి వారిపై పడి పళ్లతో గొలుసును కట్ చేసి పరారవుతారు. ఇదే విధంగా ఈనెల 15న బోరబండకు చెందిన అశోక్‌కుమార్ ఎర్రగడ్డలో పటాన్చెరు బస్సు ఎక్కాడు. బీరంగూడ కమాన్ వద్ద బస్సు దిగుతుంటే నిందితులు అతని మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసుని కట్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శివరాత్రి పండుగ సందర్భంగా పోలీసులు బస్‌స్టాప్‌లు, పబ్లిక్ ప్లేసుల్లో గస్తీ చేస్తున్నారు. బీరంగూడ కమాన్ వద్ద నిందితుడు సంతోశ్ క్రైం పోలీసులకు అనుమానంగా కన్పించడంతో అతడిని పట్టుకుని వివరాలు అడిగారు. అతని వద్ద నుంచి సరియైన సమాధానం రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. దీంతో తాను చేసిన నేరాల గురించి పోలీసులకు చెప్పాడు. పోలీసులు రిసీవర్ పూజ కాంబ్లీ నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆమెకు నోటీసు ఇచ్చారు. నిందితుడు సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైన్స్నాచర్ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం పోలీసులను ఏసీపీ అభినందించారు. ప్రెస్ మీట్లో ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పాలవెల్లి, ఎస్సై నర్సింహ, క్రైం సిబ్బంది గోపీకృష్ణరెడ్డి, ధర్మేందర్, నారాయణ, మహేశ్, విక్రమ్, ప్రకాశ్, సిద్దన్న ఉన్నారు.