రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల ( Power Issues ) తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్( Sarpanch Srinivas ) వాపోయారు. ఈ మేరకు మండల విద్యుత్ ఏఈ శ్రీనివాస్ రావుకు వినతి పత్రం అందజేశారు. గతంలో పసంబంధిత విద్యుత్ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. పలు ఇళ్లపై నుంచి వెళ్తున్న కరెంటు వైర్లను తొలగించాలని కోరారు. ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరారెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.