వట్పల్లి, ఆగస్టు 13: గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా వట్పల్లి మండలంలోని పోతులబోగుడ గ్రామానికి మంజూరైన 6 యూనిట్ల గొర్రెలను అదివారం లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వలు గొల్ల, కురుమలను పట్టించుకోలేదన్నారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. గొర్రెల పంపిణీతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గొర్రెలు పంపిణీ చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి పాండ్యన్, గ్రామ నాయకులు, యువకులు, రైతులు పాల్గొన్నారు.
గొర్రెల పెంపకం మీదనే బతుకుతున్నం
సీఎం కేసీఆర్ సార్ మాకు రెండో విడత గొర్రెలు ఉచితంగా అందించి, మా కష్టాలు తీర్చిండు. గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదిగి, కేసీఆర్ సారు పేరు నిలిబెడుతాం. అందరి బాగు కోరే సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా అండగా నిలబడుతం.
– నిమ్మగారి శ్రీను పోతులబోగుడ, వట్పల్లి
ప్రభుత్వ సాయం మరువలేనిది
గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఉచితంగా గొర్రె లు పంపిణీ చేయడంతో ఉపాధి లభిస్తున్నది. గొర్రె ల పెంపకం తప్ప వేరే పని చేయలేం. మా లాంటి వారి కష్టాలు సీఎం కేసీఆర్ సారు తెలుసుకుని ఉచితంగా గొర్రెలు అందిస్తున్నడు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడు మా మద్దతు ఉంటుంది.
– మొండి బీరయ్య, పోతులబోగుడ, వట్పల్లి