మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 5: వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయా యి. పంటల దిగుబడుల కంటే పెట్టుబడి ఖర్చులు అధికం అవుతుండడంతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. దీనిని అధిగమించేందుకు ఇటీవల కాలంలో రైతులు విభిన్న రీతుల్లో పంటలను సాగుచేస్తూ లా భాలు పొందుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి చెం దిన కంఠారెడ్డి మధుసూదన్‌రెడ్డి అనే రైతు తనకున్న ఐదెకరాల భూమిలో తొలుత డ్రాగన్ పంటను సాగుచేశాడు. డ్రాగన్ పం ట చేతికందేందుకు మూడేండ్ల సమయం పడుతుంది.
అప్పటివరకు పెట్టుబడి ఖర్చులే తప్ప లాభాలు అనేవి లేవని గ్రహించిన మధుసూదన్‌రెడ్డి అంతర పంటగా మునగ పంటను సాగుచేశాడు. దీంతో సరిపెట్టకుం డా అందులోనే మూడో పంటగా పత్తి పం టను సాగుచేశాడు. ఇలా ఏకకాలంలో ఒకే భూమిలో మూడు పంటలు సాగు చేయడంతో రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. ఈ ఏడాది పత్తి పంట ఆశించిన దానికంటే అధికంగా దిగుబడి రావడంతో రైతు మధుసూదన్‌రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
దీనికితోడు మరో రెండు మూడు నెలల వ్యవధిలో మునగ పంట కూడా చేతికందుతుందని, మునగ పంటతో డ్రాగన్ పంటకు నీడ కూడా లభిస్తున్నదని, దీనివల్ల నీడ కోసం షెడ్ నెట్‌ను ఏర్పాటు చేసే అవసరం తప్పిందని సదురు రైతు తెలిపాడు. ఏకకాలంలో ఒకేభూమిలో మూడు పంటలు సాగు చేస్తుండడంతో మధుసూదన్‌రెడ్డి వ్యవసాయ క్షే త్రాన్ని పలువురు రైతులు సందర్శించి, పం టల సాగు గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. రైతును వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అభినందిస్తున్నారు.
ఏకకాలంలో మూడు పంటలు సాగు చేస్తుండడంతో నాకు పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గాయి. డ్రాగన్ పంటలో మునగ సాగు చేయడతో డ్రాగన్ మొక్కలకు నీడ లభిస్తుంది. దీనికితోడు మార్కెట్లో మునగ పంటకు బాగా డిమాండ్ ఉంది. పెట్టుబడి ఖర్చులు రాబట్టేందుకు పత్తి పంటను సాగు చేశాను. నా ప్రయ త్నం విజయవంతమైంది. మామూలు పంట సాగుతో లభించే దిగుబడి కంటే అధికంగా పత్తి దిగుబడి వస్తున్నది. రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించడం కోసం అంతర పంటలను సాగు చేసుకోవాలి.
– కంఠారెడ్డి మధుసూదన్‌రెడ్డి, రైతు, మద్దూరు (సిద్దిపేట జిల్లా)