సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 20: సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్తో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్ల కోసం 163 దరఖాస్తులు స్వీకరించారు. డీఆర్వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రాజుకుమార్, అధికారులు పాల్గొన్నారు.