Road Rules | మెదక్ రూరల్, జనవరి 03 : రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నా రు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హవేలీ ఘన్ పూర్ ఉన్నంత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొని వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా వారోత్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకె ళ్లాలని చెప్పారు.
కండీషన్లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అధికారులు రవితేజ, నరేష్, శ్రీలత, ఉపాధ్యాయులు చల్ల రవీందర్, దెవులా రాజేశం, అశోక్, మధురాక్షి, జ్యోతి, రజని, ఎల్లమ్మ, ప్రతిభ, సుజాత, ఫయాజ్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.
