జగదేవ్‌పూర్, జూలై 21: పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు అందిస్తూ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే బాధ్యత ఆత్మ కమిటీలదేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సూచించారు. ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్‌గా రెండోసారి నియామకమైన జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుండా రంగారెడ్డి, మండల నాయకులు కార్యకర్తలతో కలిసి గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డిని మంత్రి అభినందించడంతో పాటు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలువాలని సూచించారు.
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఇతర ప్రాంతాల కమిటీలకు ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలన్నారు. రైతులకు పంటల సాగు, విత్తనాలు, ఎరువులు, పామాయిల్ పంట సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్, అమరావతి, పాండుగౌడ్, జడ్పీటీసీలు రామచంద్రం, మల్లేశం, గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.