Woman Murder | నర్సాపూర్, ఏప్రిల్ 11 : హత్యకు గురైన ఓ మహిళ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై లింగంలతో కలిసి జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ శుక్రవారం నర్సాపూర్ పీఎస్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం మూసాపేట్ గ్రామం జయరాం తాండాకు చెందిన మెగావత్ భుజాలి(52) గత నెల 25వ తేదిన అదృశ్చమైందని పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 3వ తేదీన నర్సాపూర్ మున్సిపాలిటీలోని మెదక్ మార్గంలో గల డంపింగ్ యార్డ్ చెట్ల పొదల్లో కుళ్ళిన స్థితిలో ఓ మహిళ మృతదేహం ఉందని సమాచారం అందుకున్నారు. ఇక అక్కడికి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించగా.. మృతురాలిని భుజాలిగా నిర్ధారించారు. ఈ హత్య కేసు విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి మృతురాలిని ఆటోలో తీసుకొని వెళ్తుండడం గమనించారు.
పాత నేరస్థుడైన మహబూబ్‌నగర్ జిల్లా అయ్యవారిపల్లి తండాకు చెందిన కేతావత్ గోపాల్ ఫోటోతో సరిపోవడంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా వారం రోజుల తర్వాత గోపాల్ చిక్కడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. 2023లో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను అత్యచేసిన కేసులో గోపాల్ జైలుకు వెళ్ళాడు. వారం రోజుల క్రితం జైలు నుండి వచ్చిన గోపాల్ కల్లు కంపౌండ్‌లో మెగావత్ భుజాలిని కూలీ పని ఉంది.. వెయ్యి రూపాయలు ఇస్తానని నమ్మబలికాడు. ఆమెను ఆటోలో నర్సాపూర్ మున్సిపాలిటీ సమీపంలోని డంపుయార్డు పక్కన గల చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి జాకెట్‌తో గొంతుకు చుట్టు హతమార్చి ఆమె వద్ద గల రూ.400 తీసుకెళ్లాడు. గతంలో కూడా గోపాల్‌పై పలు కేసులు ఉన్నాయని ఎస్పీ ఉదయ్‌కుమార్ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.