మెదక్ అర్బన్, అక్టోబర్9: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధా న కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2012లో తన తండ్రి తునికి నర్సింగరావు బోనాల గ్రామానికి చెందిన గురిజకుంట ఎల్లయ్య దగ్గర పట్టా భూమి సర్వే నంబర్ 421లో 242 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశాడని చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన తునికి శ్రీనివాస్ తెలిపారు. అప్పుడే ఆ భూమిని తన తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
20 17లో తన తండ్రి చనిపోగా ఆయన పేరుమీద ఉన్న సదరు భూమి 2018లో తన పేరు మీదికి వచ్చిందన్నారు. తన తండ్రికి భూమి అమ్మిన ఎల్లయ్య కుమారుడు గురిజకుంట నాగులు కొనుగోలు చేసిన భూమికి పొజిషన్ చూపిండ కుండా ఇబ్బంది పెడుతున్నాడని శ్రీనివాస్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. రిజిస్ట్రేషన్ ప్లాన్లో ఉన్న కొలతల ప్రకారం కాకుండా వేరేవిధంగా ఇస్తామంటున్నారు. తనకు రిజిస్ట్రేషన్లో చూ పించన భూమిని తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. చట్ట ప్రకారం ఫిర్యాదుదారుడికి తగిన న్యాయం చేయాలని ఎస్పీ రామాయంపేట సీఐకి సూచించారు.