చేగుంట, జనవరి 02: మెదక్ జిల్లా నుంచి అండర్ -15, అండర్ -18 విభాగాల్లో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు 64 మంది ఎంపికయ్యారు. శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అండర్-15 బాలబాలికల అండర్ -18 టాకిల్ రగ్బీ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు. రెండు విభాగాల్లో అద్భుత ప్రతిభ చూపిన 16 మంది బాలికలు, 16 మంది బాలురను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.
అండర్ -15 బాలికల విభాగంలో కీర్తన, నందిని, నికిత, శ్రీకారుణ్య, కల్పన, హరిణి సింగ్, లావణ్య, వర్షశ్రీ, దివ్య, నందిని, నమ్నిన్, కృతిక ఎంపికవ్వగా.. స్టాండ్ బైగా స్ఫూర్తి, శ్రీవల్లి, కల్పనకు చోటు దక్కింది. అండర్ -15 బాలుర విభాగంలో వేణుగోపాల్, అక్షయ్, కుమార్, సాయి రెశ్వంత్, జీవన్, రఘునందన్, సాత్విక్, హర్షవర్ధన్, రాజేష్, యశ్వంత్, గౌతం సెలెక్ట్ కాగా.. స్టాండ్ బైగా ప్రవీణ్, భరత్, ధనుష్ ఎంపికయ్యారు.
అండర్- 18 బాలికల విభాగంలో వందన, సారీబా, లేఖ, మమత, జోష్ణ, భవాని, లక్ష్మీదేవి, వైష్ణవి, అమూల్య, దివ్య, వర్షశ్రీ, రాణిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్టాండ్ బైగా సుప్రియ, కీర్తన, మాయవతిలు సెలెక్ట్ అయ్యారు. అండర్ -18 బాలుర విభాగంలో విష్ణు శ్రీ చరణ్, రామాంజనేయులు, అరవింద్, ప్రశాంత్, అనిల్, కెవిన్, రంజిత్, ఆదర్శ్, విష్ణు, పండరి, ఇందల్ సింగ్, ధీరజ్ ఎంపికయ్యారు. స్టాండ్ బైగా అజయ్, అక్షిత్, రాకేష్ నిలిచారు
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారులు, క్రీడాకారిణులు ఎంపిక కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ స్రవంతి సతీష్, ఉపసర్పంచ్ రఫీక్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, రెఫరీలు మహేష్, నవీన్, నరేష్, పీడీలు ప్రవీణ్, చంటి, సరిత, శిల్ప, భాగ్యశ్రీ, రజిత, అనీలా, తదితరులు పాల్గొన్నారు.