ఎస్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

మెదక్ కలెక్టరేట్, జనవరి 26: 72వ గణతంత్ర దినోత్స వం సందర్భంగా జిల్లా పోలీ సు ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి జెండాను ఎగురవేశా రు. కరోనా సమయంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ చం దనదీప్తి అభినందించారు. పోలీసు ఉద్యోగం రావడం అదృష్టంగా భావించి సక్రమం గా విధులు నిర్వహించి, ప్రజ ల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు.
ప్రజల్లో పోలీసు అధికారులు సిబ్బంది మమేకమై విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్ధేశం చేశారన్నారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడడంలో ఎంతో శ్రమించి ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడడంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు ఉగ్రవాదుల, తీవ్రవాదుల, ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేశారని, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా పేరు పొందిందని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ ప్రభాకర్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ చందర్‌రాథోడ్, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..
- సంఘటితంతోనే మహిళల రాణింపు