ఆదివారం 29 మార్చి 2020
Medak - Feb 21, 2020 , 06:06:55

నిరుపేదలకు ప్రభుత్వ అండ

నిరుపేదలకు ప్రభుత్వ అండ

మెదక్‌, నమస్తే తెలంగాణ : అనారోగ్యాల పాలై దవాఖానలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం హవేళీఘనపూర్‌ మండలం కూచన్‌పల్లి వ్యవసాయ క్షేత్రంలోని కార్యాలయం వద్ద మెదక్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్య సేవల కోసం దవాఖానల్లో చికిత్సలు చేయించుకుంటున్న 17 మంది లబ్ధిదారులకు రూ.7,90,700ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ కొత్తపల్లి చైర్మన్‌ త్యార్ల రమేశ్‌, పీఏసీఎస్‌ నాగాపూర్‌ చైర్మన్‌ శ్రీహరి, ఎంపీటీసీ సిద్దిరాంరెడ్డి, సర్పంచులు రాజేందర్‌రెడ్డి, దేవాగౌడ్‌, యామిరెడ్డి, కేతావత్‌ రమేశ్‌, సౌందర్య వినోద్‌, ఉప సర్పంచ్‌ భయ్యన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo