రామాయంపేట, మార్చి 16: మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు బైపాస్ నుంచి రామాయంపేటకు వెళ్తుండగా, కామారెడ్డి ఆర్టీసీ డిపో బస్సు కారును ఢీకొట్టి డివైడర్‌ను తాకింది.
ఈ ఘటనలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రామాయంపేట దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.