సిద్దిపేట, జూలై 7: వ్యాస మహర్షి యోగా సొసైటీ, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్‌రోడ్‌లో యోగాగురువు తోట సతీశ్ ఆధ్వర్యంలో 108 సామూహిక సూర్య నమసారాల సాధన నిర్వహించారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, సంధ్య, శ్రీనివాస్, రాములు, సురేశ్, బసవరాజ్, భరత్, వేణు, ఆనంద్, వనమాల, సాయి తేజ, చందన, మంజుల పాల్గొన్నారు.
సిద్దిపేట, జూలై 7: మట్టి స్నానం చేయడం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ ని యోగా గురువు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌం డేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని వయ్యాల గార్డెన్లో యో గా గురువులు అశోక్ కృష్ణమూర్తి, పెద్దిమనోహర్ మట్టి స్నాన కార్యక్రమం నిర్వహించారు. ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిద్ధిరాములు, వినోద్, కత్తుల బాపురెడ్డి, గురూ జీ, రవికుమార్, ప్రభుదాస్, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, దేవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.