రామాయంపేటలో సేవాలాల్ జయంతి
హాజరైన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
రామాయంపేట, ఫిబ్రవరి 12 : తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి, మరో సేవాలాల్గా సీఎం కేసీఆర్ నిలిచారని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం సేవాలాల్ మహరాజ్ 283వ జయంతికి ముఖ్య అతిథిగా విచ్చేసి గిరిజనుల బోగభండార్ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. వేదికపై గిరిజనులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల గురించి ఏ ఒక్కరూ కూడా ఆలోచన చేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌తోనే గిరిజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 12 శాతం గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి, అమలు కోసం పార్లమెంట్‌కు పంపించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గిరిజన దేవాలయాల్లోని పూజారులకు ధూపదీప, నైవేద్యాలకు నిధులు మంజూరుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. పంచాయతీలుగా ఏర్పడిన తర్వాత తండాల్లో పంచాయతీలకు పక్కా భవనాలకు నిధులు మంజూరు ఇస్తామన్నారు. ఆయన వెంట నిజాంపేట జడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, సీనియర్ నాయకుడు పుట్టి అక్షయ్‌కుమార్, సర్పంచ్‌లు శివప్రసాదరావు, నర్సింహారెడ్డి, హవేళీఘన్‌పూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, సురేశ్ నాయక్, రవితేజ పాల్గొన్నారు.