
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా..
సిద్దిపేట జిల్లాలో సరాసరిగా 7.96 సె.మీ వర్షం కురిసింది. అత్యధికంగా నంగునూరు మండలంలో 14.65 సె.మీ వర్షపాతం నమోదు కాగా, మండలాల వారీగా దుబ్బాకలో 4.02 సెం.మీ, సిద్దిపేట రూరల్‌లో 4.23సెం.మీ, చిన్నకోడూరులో 11.0సెం.మీ, బెజ్జంకిలో 12.50 సెం.మీ, కోహెడలో 13.82సెం.మీ, హుస్నాబాద్‌లో 5.45సెం.మీ, అక్కన్నపేటలో 9.68సెం.మీ, సిద్దిపేట అర్బన్‌లో 7.82సెం.మీ, తొగుటలో 6.93సెం.మీ, మిరుదొడ్డిలో 5.15సెం.మీ, దౌల్తాబాద్‌లో 5.35సెం.మీ, రాయిపోల్‌లో 4.73సెం.మీ, వర్గల్లో 5.42సెం.మీ, ములుగులో 2.78సెం.మీ, మర్కూక్‌లో 9.93 సెం.మీ, జగదేవ్‌పూర్‌లో 9.71 సెం.మీ, గజ్వేల్‌లో 4.92 సెం.మీ, కొండపాకలో 10.42 సెం.మీ, కొమురవెల్లి 13.38 సెం.మీ, చేర్యాలలో 5.48 సెం.మీ, మద్దూరులో 9.27 సెం.మీ, నారాయణరావుపేటలో 2.93 సెం.మీ, ధూళిమిట్టలో 11.28 సెం.మీ. వర్షం పడింది.
సంగారెడ్డి జిల్లాలో..
వర్షంతో సంగారెడ్డి జిల్లా తడిసిముద్దయ్యింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. జిల్లా అంతటా 44.5 సె.మీ వర్షపాతం నమోదు కాగా, సాధారణ వర్షపాతం 1.6 సెం.మీ కురిసింది. జిల్లాలో ఇటీవల వర్షాలు కురవకపోవటంతో రైతుల్లో ఆందోళన కనిపించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలు ఎదిగేందుకు ఉపయోపడతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఆరు మండలాల్లో 20 నుంచి 59శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, సదాశివపేట, మునిపల్లి, వట్పల్లి మండలాల్లో సాధారణ
వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. జహీరాబాద్ నియోజవకర్గంలోని నారింజ ప్రాజెక్టు పొంగి పొర్లుతుతుంది. సింగూరు ప్రాజెక్టులోకి వర్షంనీరు వచ్చి చేరుతుంది. సోమవారం సింగూరు ప్రాజెక్టులోకి 756 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్ల సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 21.375 టీఎంసీలకు చేరుకుంది. భారీ వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలోని వసంత్ విహార్కాలనీలోని పలు ఇండ్లు నీటిలోమునిగాయి. జిల్లా సరాసరి వర్షపాతం 1.6 సె.మీ నమోదు కాగా, అత్యధికంగా జహీరాబాద్‌లో 6.6 సె.మీ వర్షం కురిసింది. మొగుడంపల్లిలో 64.3సెం.మీ, కోహీర్‌లో 2.5 సెం.మీ, మనూర్లో 2 సెం.మీ, జిన్నారం, పటాన్చెరు మండలాల్లో 1.8 సెం.మీ, ఝరాసంగం, సిర్గాపూర్‌లో 1.6 సెం.మీ, గుమ్మడిదల, కల్హేర్‌లో 1.3 సెం.మీ, నారాయణఖేడ్, కంది, నాగల్గిద్దలో 1.2 సెం.మీ, అందోల్, అమీన్పూర్, ఆర్సీపూర్, రాయికోడ్‌లో 1.1 సెం.మీ, సంగారెడ్డిలో 1 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మునిపల్లి మండలంలో 0.6 సెం.మీ వర్షం కురిసింది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా..
రెండు రోజులుగా మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం మొదలైన వర్షం సోమవారం సాయంత్రం వరకు కురిసింది. జిల్లా వ్యాప్తంగా 2 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా తూప్రాన్‌లో 3.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిజాంపేటలో 3 సెం.మీ, చేగుంట, నార్సింగి మండలాల్లో 3 సెం.మీ, మాసాయిపేటలో 2.8 సెం.మీ, మెదక్, రామాయంపేట మండలాల్లో 2.6 సెం.మీ, శివ్వంపేటలో 2.3 సెం.మీ, రామాయంపేటలో 2.4 సెం.మీ వర్షపాతం నమోదైంది