
వర్గల్, జూన్ 27 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 56వేల చెరువులను అభివృద్ధి చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం నాచారం పెద్ద చెరువు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 56వేల చెరువులను అభివృద్ధి చేశామన్నారు. చెరువులను అభివృద్ధి చేయడమే కాకుండా వాటిలో అన్ని కాలాల్లో నీరు ఉండేందుకు కాళేశ్వరం కాలువలను చెరువులకు అనుసంధానం చేస్తున్నారన్నారు. రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నివిధాలుగా చర్యలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలు, ఎంపీపీ లతారమేశ్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, స్థానిక సర్పంచ్ నాయకులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలో మీసేవా కేంద్రాన్ని ప్రారంభించారు.