రాయికోడ్, ఫిబ్రవరి24: మత సామరస్యానికి ప్రతీకగా ఉర్సు జరుగుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సింగితం గ్రామంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న హజ్త్ సుల్తానే దర్గా ఉర్సు గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉర్సు నిర్వహించడం సంతోషకరమన్నారు. దర్గా అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. సీసీ రోడ్లు, విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నీటి సమస్య, కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానన్నారు. ఉర్సు నిర్వాహకుడు మారుఫ్అలీ ఎమ్మెల్యేను సన్మానించారు. ఉర్సులో నిర్వహించిన కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్, సర్పంచ్ సంతోష్కుమార్పాటిల్ పాల్గొన్నారు.