
పటాన్చెరు, ఆగస్టు 30: ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రతి విద్యార్థి తమతమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు వీడియో సందేశం అందించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి పాఠశాల, కళాశాలను శానిటేషన్ చేయడంతో పాటు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగత్రలు పరీక్షిస్తారన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే దవఖానకు తరలించడంతో పాటు మెరుగైన చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలకు ఇప్పటికే థర్మల్ స్కానర్‌తోపాటు శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మండల విద్యాధికారి పాండురంగం రాథోడ్ పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత
ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, ప్రస్తుత సమాజంలో సీసీ కెమెరాల వినియోగం బాగా పెరిగిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లి గ్రామంలో రెండున్నర లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మంచి-చెడు సంఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నేరస్తులను, సంఘ విద్రోహ శక్తులను ఆరికట్టడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ బీంరెడ్డి, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ్‌భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ రేణుకస్వామి, సీఐ లాలూనాయక్, ఎస్సై విజయ్‌కృష్ణ, గ్రామ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
పటాన్చెరు డివిజన్ పరిధిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పటాన్చెరు పట్టణంలోని పంచముఖీ హనుమాన్ దేవాలయం నుండి ఆల్వీన్‌కాలనీ వరకు, నోవపాన్ చౌరస్తా నుండి ఎస్వీఆర్ ఫంక్షన్‌హాల్ వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్, వెంకటేశ్, చంద్రకుమార్, జయశ్రీసాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.