
మెదక్, నవంబర్ 22 : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొల్చారం మం డలం ఎనగండ్ల గ్రామానికి చెందిన సాయిబాబాకు పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన లక్ష్మితో 2008లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య గత కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మూడు తులాల బంగారం, 15 తులాల పట్టగొలుసులు, రూ.25వేల నగదు తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోయింది. గతంలో కూడా ఇలాగే వెళ్లిపోతే కొల్చారం పోలీసులు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారని ఇప్పుడు కూడా ఎలాగైనా నా భార్య జాడ కనుక్కొని నా పిల్లలకు తగు న్యాయం చేయాలని కోరారు.
నిజాంపేట మండలం నార్లా పూర్కు చెందిన సంగు వెంకటేశ్ ఇంటి నిర్మాణం చేస్తున్న తరుణంలో సంగు ఆంజనేయులు, సంగు చంద్రంలు అభ్యంతరం చెప్పడంతో అనుమతులు తీసుకొని పనులు మొదలు పెట్టాడు. 14వ తేదీన పుట్టి వేసే సమయంలో సంగు ఆంజనేయులు, సంగు చంద్రం పనివారిని పని చేయకూడదని బెదిరించారు. దీంతో సంగు వెంకటేశం ఎస్సైకి తెలుపగా వచ్చి పని ఆపడానికి వీలులేదని వారి వద్ద పర్మిషన్ పత్రాలు ఉన్నవి నచ్చజెప్పి వెళ్లిపోయ్యాడు. అనంతరం జంగారా మల్లేశం పారతో పిల్లర్ కాలాలు, సిమెంట్ సంచులను ధ్వంసం చేశాడు. తనని, అడ్డువచ్చిన సంగు తిరుపతిని పారతో గాయపర్చాడు. సంగు ఆంజనేయులు, సంగు చంద్రం, సంగు ఎల్లయ్య, పెద్ద మల్లారెడ్డి రాజులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.