జిన్నారం, మార్చి 2 : గ్రామాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఊట్ల గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే మల్లన్న జాతరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బుధవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు శిగాలు ఊగుతూ అగ్నిగుండాలు తొక్కారు. అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు ప్రత్యేకమైనవన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నియోజకవర్గంలో ఆలయాల పునర్నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ మల్లన్న దయతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. మధ్యాహ్నం అగ్ని గుండాల చుట్టూ బండ్ల ఊరేగింపు, సాయంత్రం మహిళలు బోనాలతో మల్లన్నకు మొక్కులు సమర్పించారు. జాతరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు హాజరై మల్లన్నను దర్శించుకున్నారు. ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించారు. అగ్నిగుండాలను వీక్షించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ గంగు సర్పంచ్ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉపసర్పంచ్ రవి, మాజీ సర్పంచ్‌లు శివరాజ్, వెంకట్రాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిన్నారంలో దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
జిన్నారంలో దుర్గమ్మ జాతర బుధవారం ఘనంగా జరిగింది. అమ్మవారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే నిర్వాహకులకు హామీ ఇచ్చా కార్యక్రమంలో సర్పంచ్ లావణ్యాశ్రీనివాస్రెడ్డి, పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, కొడకంచి సర్పంచ్ శివరాజ్, ఉపసర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, భోజిరెడ్డి, నిఖిల్‌గౌడ్ పాల్గొన్నారు.