
వెల్దుర్తి, జూలై 14: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు తూ పల్లెప్రగతి గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పలు అభివృద్ధి పనుల గుర్తింపు, మౌలిక వసతులను కల్పించామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర పక్రియలా చేపట్టాలని, గ్రామాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. హరితహారంలో మొక్కలను నాటి వాటిని రక్షించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. ఎస్సై మహేందర్ మాట్లాడుతూ కేజీవీల్ ట్రాక్టర్లతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, కావున కేజీవీల్ ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దని, వచ్చినవాటిని గుర్తించి జరిమానాలను విధించడంతో పాటు కేసులు నమో దు చేస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మూగ జీవాలతోపాటు ప్రజల ప్రాణాలు పోతున్నాయని, చాలా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు గుర్తించి అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఏఈ పెంట్యానాయక్పై పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌తో పాటు పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.