
గుమ్మడిదల, ఆగస్టు 30 : శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు బోనం నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన మొక్కులు తీరుతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో బోనాల పండుగ నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకు రేణుక, ఎంపీటీసీ పార్వతమ్మ, గ్రామస్తుల పాల్గొన్నారు.
ఖాజీపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు
పెద్దమ్మతల్లి దయతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖాజీపల్లి గ్రామంలోని పెద్దమ్మతల్లికి నిర్వహించిన బోనాల పండుగలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయం మంచి ప్రకృతి వాతావరణంలో పునర్నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారు మహిమగల దేవత అని, ఆమె దయతో అందరూ సుభిక్షంగా ఉం డాలన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథులను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ చిట్లసత్యనారాయణ, ఎంపీటీసీ భార్గవ్, మాజీ సర్పంచ్ ఆకుల మమతనవీన్కుమార్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
వావిలాలలో…
మండలంలోని వావిలాలలో బోనాల పండుగ ఘనం గా జరిగింది. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి బోనాలతో వెళ్లి మొక్కులు సమర్పించారు. బోనాల పండుగకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనవాస్గౌడ్, ఎంపీపీ రవీందర్‌గౌడ్ హాజరై సర్పంచ్ సుశాంతి, ఉపసర్పంచ్ నవనీత్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.