
జహీరాబాద్, అక్టోబర్ 1: చెరుకు రైతుల ముసుగులో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రోకర్లు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జహీరాబాద్ జోన్లో ఉన్న చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. జోన్ పరిధిలో ఉన్న చెరుకును సంగారెడ్డి, కామారెడ్డి, మ హబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి మం త్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మె ల్సీ ఫరీదుద్దీన్ కృషిచేస్తున్నట్లు చెప్పారు.అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంజీ.రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, గోవర్ధన్‌రెడ్డి, పెంటారెడ్డి, పాండురంగారెడ్డి మాట్లాడారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోనేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు జహీరాబాద్‌కు వచ్చి ఏమి చేశారన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరుకును సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించేందుకు ప్రభుత్వం రవాణా సబ్సిడీ చెల్లించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. 30కిలో మీటర్లు వరకు రైతు రవాణా ఖర్చులు చెల్లించాలని, మిగతా ఖర్చులు ప్రభు త్వం చెల్లించనున్నట్లు తెలిపారు. టోల్ గేట్ సమస్యపై ఎంపీ బీబీ పాటిల్ కేంద్ర మంత్రులను కలిసినట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మొయినోద్దీన్, కోహీర్ మండల అధ్యక్షుడు నర్సింహులు, ఝరాసంగం మండల అధ్యక్షులు రాచయ్యస్వామి, టీఆర్ఎస్ నాయకులు విజేందర్‌రెడ్డి, ఇజ్రాయిల్ బాబీ, నారాయణ, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.