శుక్రవారం 05 మార్చి 2021
Mancherial - Jan 22, 2021 , 00:25:38

కార్పొరేట్‌ క్షౌరశాలలకు అనుమతి ఇవ్వద్దు

కార్పొరేట్‌ క్షౌరశాలలకు అనుమతి ఇవ్వద్దు

మంచిర్యాల అర్బన్‌, జనవరి 21: మంచిర్యాలలో ఇతర కులాల వారు కార్పొరేట్‌ స్థాయిలో క్షౌరశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీటికి అధికారులు అనుమతి ఇవ్వవద్దని నాయీ బ్రాహ్మణులు డిమాండ్‌ చేశారు. గురువా రం పట్టణంలో క్షౌరశాలలను బంద్‌ చేసి నాయీబ్రాహ్మణ, క్షౌరవృత్తి దారుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.  

దండేపల్లి, జనవరి 21 : మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ హన్మంతరావుకు వినతి పత్రం అందించారు. నాయీబ్రహ్మణ సేవా సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, మల్లేశ్‌, సభ్యులు తిరుపతి, వెంకటేశ్‌, శంకర్‌, రవి, సత్తయ్య, తదితరులు ఉన్నారు.

సీసీసీ నస్పూర్‌, జనవరి 21 : కార్పొరేట్‌ సెలూన్ల ఏర్పాటు ను నిరసిస్తూ నస్పూర్‌లో క్షౌరవృత్తిదారులు ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు జంపాల చంద్రయ్య, గౌరవ అధ్యక్షులు కుర్మిళ్ల చంద్రయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుర్మిళ్ల రాజ్‌మోహన్‌, నాయకులు ఎనగందుల వెంకటేశ్‌, కంది మల్లేశ్‌, వడ్లూరి తిరుపతి, మిడిదొడ్డి మొండయ్య, కొత్తగట్టు నారాయణ, ముత్యాల రాజయ్య, తంగళ్లపల్లి లక్ష్మీరాజం, కుర్మిళ్ల సత్యనా రాయణ, కల్యా ణం లక్ష్మణ్‌, చిట్యాల కిష్టయ్య, దాగం బాపు, సహాయ కార్యదర్శులు వేయిగండ్ల వెంకటేశ్‌, స్వామి, శ్రీకాం త్‌, ముత్యాల సత్యరాజ్‌, తిరుపతి, పోషం పాల్గొన్నారు. 

తాండూర్‌, జనవరి 21 : నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దుకాణాలు బంద్‌ చేసి నిరసన తెలిపారు. అధ్య క్షుడు బొమ్మకంటి పోశం, వెయ్యిగండ్ల సురేశ్‌, జంపాల రవీందర్‌, దడిగెల సురేశ్‌, పెంటయ్య పాల్గొన్నారు.

మందమర్రి : నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో ర్యాలీ తీశారు. నాయకులు తహసీల్దార్‌ రాజలింగుకు వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు సింగరేణి ఉన్నత పాఠశాల వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు మురారి రవి, ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి శ్రీనివాస్‌, సూత్ర పు కుమార్‌, జంపాల వేణు, ముత్యాల రవీందర్‌, కంది లక్ష్మీ నారాయణ, తుమ్మల శ్రీనివాస్‌, కొదురుపాక శంకర య్య, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌, జనవరి 21 :  నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. గౌరవ అధ్యక్షుడు సమ్మయ్య, అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు వీ స్వామి, శ్రీనివాస్‌, టీ శ్రీనివాస్‌, రాజు, రవి పాల్గొన్నారు. 

భీమారం, జనవరి 21 : మంచిర్యాల - చెన్నూర్‌ జాతీయ రహదారిపై నాయిబ్రాహ్మణలు రాస్తారోకో నిర్వహించారు.  ఎస్‌ఐ సంజీవ్‌ అందోళనకారులను శాంతింపజేశారు. 

కాసిపేట, జనవరి 21 : సోమగూడెంలోని నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హెయిర్‌ సెలూన్‌ దుకాణాలను మూసివేశారు. నాయకులు కల్యాణం సురేశ్‌, ఎనగందుల శేకర్‌, నాగవెళ్లి నవీన్‌, బిజ్జగిరి రఘు, గుంజపడుగు రాంచందర్‌, తూ ముల అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్‌ : తహసీల్‌ కార్యాలయంలో నాయీ బ్రాహ్మణులు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ పొట్టకొట్టవ ద్దని నాయకులు పేర్కొన్నారు.

VIDEOS

logo