గురువారం 21 జనవరి 2021
Mancherial - Dec 24, 2020 , 00:14:54

అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

  • పలుచోట్ల పాల్గొన్న ఏరియా జీఎంలు
  • జెండాలు ఎగరేసి.. మిఠాయిలు పంపిణీ
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మంచిర్యాల టౌన్‌(శ్రీరాంపూర్‌) : శ్రీరాంపూర్‌లోని గనులు, ఓసీపీ, డిపార్ట్‌మెంట్లల్లో బుధవారం సింగరేణి సంస్థ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. జీఎం కార్యాలయంలో ఏరియా స్థాయిలో నిర్వహించారు. జీఎం లక్ష్మీనారాయణ జెండా ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డితో కలిసి జీఎం మాట్లాడారు. సంస్థ దినదినాభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్న కార్మికులు, అధికారులు, సహకరిస్తున్న నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సేవా సమితి మహిళా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వారికి జీఎం దంపతులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం కుమారస్వామి, డీవైజీఎంలు గోవిందరాజు, విజయభాస్కరెడ్డి, శ్రీనివాస్‌, రఘుకుమార్‌, రమేశ్‌, టీబీజీకేఎస్‌ ఏరియా చర్చల ప్రతినిధులు రాజనాల రమేశ్‌, పెట్టం లక్షణ్‌, రీజియన్‌ కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్‌ ఓసీపీలో ప్రాజెక్టు ఆఫీసర్‌ పురుషోత్తంరెడ్డి, ఓసీపీ మేనేజర్‌ జనార్దన్‌ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్మికులకు పంచారు. ఎస్‌డీఎల్‌ ఉత్పత్తిలో శ్రీరాంపూర్‌కు చెందిన ఆర్కే-6గని మొదటి స్థానంలో నిలించింది. కాగా, వేడుకల్లో సంస్థ డైరెక్టర్‌ ఆపరేషన్‌ ఎన్‌ చంద్రశేఖర్‌ గని మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ ఫిట్‌ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఈఈ మహేశ్‌కు అవార్డు, షీల్డ్‌ అందించారు. ఆర్కే-7పై మేనేజర్‌ గోసిక మల్లేశం, టీబీజీకేఎస్‌ ఫిట్‌ కార్యదర్శి మెండ వెంకటి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఫిట్‌ కార్యదర్శి గోపాల్‌, ఓసీపీపై ఈఈ రవీందర్‌, సేఫ్టీ ఆఫీసర్‌ వీరయ్య, ఫిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌, సీనియర్‌ పీవో అబ్దుల్‌ హషీంపాషా పాల్గొన్నారు. ఎస్‌ఆర్పీ-3పై అధికారులు ఆరుణ్‌కుమార్‌, అమర్‌నాథ్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు. 

రెబ్బెన : గోలేటి జీఎం కార్యాలయ ఆవరణలో జీఎం సంజీవరెడ్డి జెండాను ఎగురవేశారు. ముఖ్య అతిథిగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి హాజరయ్యారు. జీఎం సంజీవరెడ్డి మాట్లాడారు. సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, అధికారుల సంఘం ప్రధానకార్యదర్శి గౌసొద్దీన్‌, సర్పంచ్‌ పోటు సుమలత, ఎంపీటీసీ దుర్గం శ్రీవాణి, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్‌, పీఎం ఐ లక్ష్మణ్‌రావు, డీవైపీఎం రామాశాస్త్రీ, ఎస్‌వోటూజీఎం సాయిబాబు, ఏజీఎం శివనారాయణ పాల్గొన్నారు.


logo