ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 30, 2020 , 02:10:58

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
  • 22వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో రూ.3 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్‌ నిధులతో పట్టణంలో అవసరమైన చోట్ల ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంగా మారిన మంచిర్యాలను అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు వెచ్చిస్తున్నామన్నారు. కోట్లాది రూపాయలతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, 22వ వార్డు కౌన్సిలర్‌ మెరుగు మహేశ్వరి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo