మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 21, 2020 , 05:08:31

శివ పూజకు వేళాయె.. నేడు మహా శివరాత్రి

శివ పూజకు వేళాయె.. నేడు మహా శివరాత్రి

మహా శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వేలాల, బుగ్గ, కత్తెరశాల, మంచిర్యాల విశ్వనాథాలయం, గౌతమీశ్వరాలయంతో పాటు జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శుక్రవారం భక్తుల శివనామస్మరణతో మార్మోగనున్నాయి. శివరాత్రి వేళ ఉదయం నుంచే భక్తుల లక్షలాదిగా రానుండడంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. జైపూర్‌లోని వేలాల మల్లన్న జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అలాగే దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివకల్యాణం, పట్నాలు వైభవంగా నిర్వహించనున్నారు.

  • వేలాల, బుగ్గలో రెండు రోజుల పాటు జాతరఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక
  • లక్షలాది తరలివచ్చే అవకాశం
  • దేవాదాయ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
  • భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వేలాల, బుగ్గ, కత్తెరశాల, మంచిర్యాల విశ్వనాథాలయం, గౌతమీశ్వరాలయంతో పాటు జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శుక్రవారం భక్తుల శివనామస్మరణతో మార్మోగనున్నాయి. శివరాత్రి వేళ ఉదయం నుంచే భక్తుల లక్షలాదిగా రానుండడంతో అధికార  యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. జైపూర్‌లోని వేలాల మల్లన్న జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అలాగే దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివకల్యాణం, పట్నాలు వైభవంగా నిర్వహించనున్నారు.

- నమస్తే బృందం, మంచిర్యాల

శివుని పూజకు వేళయ్యింది. నేడు(శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలతో పాటు ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల పాటు జాతర సాగనుంది. ఈ జిల్లాలోని వేలాల, బెల్లంపల్లి బుగ్గ, కత్తెరశాల మల్లన్న, మంచిర్యాల విశ్వనాథాలయం, గౌతమీశ్వర ఆలయం, అలాగే మిగతా శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకరణలు, మామిడి తోరణాలతో ఇప్పటికే ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. దేవాదాయ, ఆలయ కమిటీలు, మున్సిపల్‌, సింగరేణి, పోలీసు, ఇతర శాఖల ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లుచేశారు. జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతో వేలాల, నస్పూర్‌లోని సీతారాంపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద గోదావరి నిండుగా ఉండడంతో భద్రతా చర్యలు చేపట్టారు.

- నమస్తే బృందంlogo