నాగర్‌కర్నూల్‌లో నీడ మాయం
జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యా హ్నం 12 గంటల 12 నిమిషాలకు జీరో షాడో డే (నీడ లేని రోజు) ఆవిష్కృతమైంది. వస్తువుపై సూర్యకిరణాలు పడితే ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సాధారణం.
నాగర్‌కర్నూల్, మే 9 : జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యా హ్నం 12 గంటల 12 నిమిషాలకు జీరో షాడో డే (నీడ లేని రోజు) ఆవిష్కృతమైంది. వస్తువుపై సూర్యకిరణాలు పడితే ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సాధారణం. ఈ ఏడాదిలో నీడ లేని రోజు మే 9వ మంగళవారం కనిపించినట్లు కలెక్టరేట్ అధికారులు గుర్తించారు. సూర్యుడు తలపైకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12:12గంటలకు కలెక్టరేట్ భవనంపై ఎండలో ఒక బాటిల్‌ను ఉంచగా దానిపై నీడ పడలేదు. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుందని అధికారులు తెలిపారు. భూమి, సూర్యుడి మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారని, ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుందని గుర్తించారు. పట్టణంలో అక్షాంశం 17.3850(ఎన్) డిగ్రీల ప్రకారం కలెక్టరేట్ భవనంపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ వ్యక్తిగత కార్యదర్శి ఖాజా, కార్యాలయ సిబ్బంది పాష, పాదం వెంకటేశ్‌లు కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. నిర్దిష్ట సమయంలో ప్లాస్టిక్ బాటిల్‌పై, అలాగే భవనంపై ఉన్న దిమ్మెల కూడా నీడ పడలేదు. అదేవిధంగా ఆగస్టు 3న మరోమారు ఈ ఘటన చోటుచేసుకోనున్నదన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

