వెల్దండ : ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సహాయంతో యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (MLA Kasireddy Narayana Reddy) యువతకు సూచించారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన యువకుడు నెలకొల్పిన ఫోర్ వీలర్ వెహికిల్ వీల్ అలైన్ మెంట్ వాటర్ సర్వీసింగ్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల ( Employment ) కొరకు ఎదురుచూడకుండా నిపుణత కలిగిన రంగంలో స్వయం ఉపాధిని ఎంచుకొని తమతో పాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా, శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత విజయ్, జేఏసీ చైర్మన్అవ్వారి శివలింగం, ట్రస్మామండల అధ్యక్షులుశేఖర్, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, పెయింటర్అసోసియేషన్ అధ్యక్షులు పసుపులమహేష్, అప్సర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.