ధరూరు, ఏప్రిల్ 12 : జూరాల బ్యాక్ వాటర్లో ఓ యువకుడు దూకి ఆత్మహత్య పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రేవులపల్లిలోని జూరాల ప్రాజెక్ట్ వద్ద మహబుబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన చాణక్య(26) ఉదయం 11గంటల సమయంలో 51వ గేట్ వద్ద బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న ఎస్సై నందికర్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది గజ ఈతగాళ్లు, అగ్ని మాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్య లు చేపట్టారు. ఎంత గాలించినా యువకు డి ఆచూకీ లభించలేదు. అయితే యువకు డు హెటిరో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. యు వకుడు బైక్ను గుర్తించామ ని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.