వనపర్తి, మార్చి 17 : సొంత వారే సాయం చే యని నేటి పరిస్థితుల్లో తమకు ఆపన్న హస్తం అం దించారనే అభిమానంతో ఆదివారం మాజీ మం త్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు ఓ ఇంజినీర్. వివరాలిలా.. శ్రీరంగాపురం మండలం జానంపేటకు చెందిన ఈరపాగ నాగరాజుకు గ్రామంలో ఎకరా పొలం ఉన్నది. అందులో ఐదు గుంటలకు సంబంధించిన సర్వే నెంబర్39/ఎ/1 వివాదంలో ఉండ గా అప్పట్లో యువ ఇంజినీర్ నాగేశ్వర్రావు తన తండ్రి నాగరాజుతో వెళ్లి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిసి తమ దీన స్థితిని వివరించారు.
దీంతో నిరంజన్‌రెడ్డి సొంతంగా రూ.70వేలు చెల్లించి ఐదుగుంటల భూమిని నాగేశ్వర్రావు తండ్రి పేరన చే యించారు. ఈ సందర్భంగా యువ ఇంజినీర్ తన తండ్రితో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆదివారం కలిసి కన్నీరు కార్చుతూ కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం వారికి రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్, గిరి, జోహెబ్, మండ్ల కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.