మరికల్, జూన్ 19: యోగ (Yoga) ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు టప్ప రామాంజనేయులు విద్యార్థులకు సూచించారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీవాణి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలను వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాసనాలు వేయాలని, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ప్రచార సమితి సభ్యులు శ్రీరామ్, పాఠశాల కరస్పాండెంట్ పూర్ణిమ వెంకటేష్, ప్రిన్సిపల్ వినీతమ్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.