దేవరకద్ర, డిసెంబర్ 24 : జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నుంచి ఆయకట్టు రైతులకు యాసంగికి సాగు నీరు విడుదల చేసేందు కు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 32.6 అడుగులకు గా నూ ప్రస్తుతం 31.8 అడుగుల నీరునిల్వ ఉన్నది. ప్రాజెక్టు పరిధిలో పాత ఆయకట్టు కింద 12వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు అధికారుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రాజెక్టు కుడి కాల్వ కింద మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భూములకు సాగునీరు విడుదల చేశారు. అదేవిధంగా ఎడమ కాల్వ కింద దేవరకద్ర మండలంలోని 3వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. అయితే ప్రతి తడికి పది రోజులు చొప్పున నీటిని విడుదల చేసి కొంత విరామం తర్వాత మరో తడికి నీటిని విడుదల చేయనున్నారు.
మొదటి తడి : జనవరి 6నుంచి 16 వరకు
రెండో తడి : ఫిబ్రవరి 3నుంచి 13 వరకు
మూడో తడి : ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు..
నాలుగో తడి : మార్చి 23 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు..
ఐదో తడి : ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న రైతులకు యాసంగిలో సాగు నీరు విడుదల చేస్తారు. ఆయకట్టు రైతులు తడుల వారీగా వచ్చే సాగునీటిని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు.