జడ్చర్ల, ఫిబ్రవరి 11 : జడ్చర్ల మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వ ర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ మంగళవారం జ డ్చర్ల మున్సిపాలిటీ ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడు తూ జడ్చర్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఫిబ్రవరి 11వ తేదీ వచ్చినా జనవరి నెలకు సంబంధించిన వేతనాలను ఇవ్వలేదని, వేతనాల కోసం 220మంది కార్మికులు ఎదురుచూస్తున్నారన్నారు.
ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్ ఉన్నా జనవరి నెలకు సంబంధించిన వేతనాలను ఇవ్వకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి వేతనాలను ఇవ్వాలని అడిగితే ఒకరు మీద ఒకరు వేసుకోవడమే కా కుండా ట్రెజరరీ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారన్నారు. కార్మికులను ఒక్కరోజు పనిలోకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసివేస్తామని బెదిరింపులకు పాల్పడే అధికారులు, పాలకవర్గం వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ము న్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.