మక్తల్, డిసెంబర్ 3 : కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సు పథకం చెప్పుకోవడానికే బాగుందని, అందులో ప్రయాణిస్తున్న మహిళలను ఆర్టీసీ వారు చిన్న చూపు చూస్తుండడంతోపాటు హేళన చేసి మాట్లాడుతున్నారని, మహిళలు కనిపిస్తే బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారని ఫ్రీ బస్సు ఏ ఉద్దేశంతో ఎవరి కోసం పెట్టారని మహిళా మణుల నుంచి మక్త ల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేదు అనుభవం ఎదురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ సమావేశ మందిరంలో అర్బన్ డే కార్యక్రమాన్ని ని ర్వ హించారు.
ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు పెద్దసంఖ్యలో హాజరైన నేపథ్యంలో ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చేపట్టిన కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి పనుల గురించి మహిళా సంఘాల సభ్యులకు తెలియపరచాలని ఎంతో ఆశతో ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగం ప్రారంభించిన మొదట్లోనే మక్తల్ మున్సిపాలిటీలో మహిళల కు ప్రభుత్వం నుంచి సిలిండర్లను అందించామంటూ ప్రసంగం ప్రారంభించి, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారంగా రాష్ట్రంలో ఫ్రీ బస్సు ప్రారంభించి మహిళలకు జీరో టికెట్ అందిం చి వారి చార్జీలను ప్రభుత్వం భరిస్తుందని మాట్లాడుతున్న క్రమంలోనే మహిళలు ఒకసారిగా అడ్డుకున్నారు.
ఫ్రీ బస్సు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఫ్రీ బస్సు ఎకాలంటే చాలా ఇబ్బందులు ఎదురవడంతో పాటు , మహిళలు అయినా మేము అవహేళనకు గురికావాల్సి వస్తుందని, ఆర్టీసీ వాళ్లు బస్సులో ఎకేటప్పుడు మహిళలను అని చూడకుండగా కించపరుస్తూ మాట్లాడుతున్నారని, మహిళలు కనిపిస్తే బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారని వాపోయారు. పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టి మహిళా మణులను అవహేళన చేసేందుకు సిద్ధమైందంటూ ఎమ్మెల్యేకు బదులిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 18 ఏండ్లు నిండిన యువతీతోపాటు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2500 చెల్లిస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా కనీసం రూ.250 కూడా ఇవ్వలేదన్నారు.
సిలిండర్‌కు సంబంధించిన డబ్బులు కూడా చెల్లించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అ మలు చేయడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ఒకసారిగా మహిళలందరూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండగా ప్రజాపాలనపై విజయోత్సవాలు నిర్వహించుకుంటున్న సభలో ఇవ్వని పథకాలను ఇచ్చినట్టుగా పేపర్లలో లెకలు చూపించడం ఏంటని ప్రశ్నించడంతో మహిళా కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే చేసేది లేక తన ప్రసంగాని ఆపి మహిళా సంఘాలకు మంజూరైన లింకేజీ రుణాలకు సంబంధించిన రూ.3.83 కోట్ల చెక్కులను అందించి వెళ్లిపోయారు. అయితే తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకుందామని వస్తే పోలీసులు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేశారని కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
పేరుకు మాత్రమే ఫ్రీ బస్సు..
కాంగ్రెస్ పార్టీ మహిళా మణులకు ఫ్రీ బస్సు అందిస్తున్నామని చెబుతున్నారు.. కానీ ప్రయాణం చేసేందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో మహిళలు ఎన్నో అవమానాలతో బస్సుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది. అవసర నిమిత్తం వెళ్లాలనుకున్నా.. ప్రస్తుతం బస్సులో వెళ్లాలంటే అవమానాలతోపాటు ఎన్నో మాట లు అనిపించుకొని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం కేవలం మహిళలను కించపర్చేందుకే ఫ్రీ బస్సు పథకం పెట్టినట్లు అనిస్తుంది.
– సత్తెమ్మ, మక్తల్
ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రాలేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనప్పటికీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో ఏ ఒక పథకం మాకు రాలేదు. ప్రస్తుతం ప్రజాపాలన విజయవత్సవాలు జరుపుకొంటున్న నాయకులు అన్ని హామీలు అమలు చేసిన తర్వాతే జరుకుంటే బాగుంటుంది. అమలు కానీ వాటిని కూడా కాగితాల్లో చూపించి అన్ని చేసినట్లుగా చెబితే ఎవరూ నమ్మరు. ఒక వేళ ఏమి చేయకుండా చేసినామని చెప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు వస్తాయి.
– సరస్వతి ,మక్తల్