అలంపూర్: ఓ మహిళ చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం చేసింది. . కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన నర్సుబాయి ( Narsubai ) అనే మహిళ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కు ( Brain Dead) గురై చనిపోయింది.
ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించడంతో వైద్యులు నర్సుబాయి నుంచి ప్రధాన అవయవాలు ( Organ Donation) తీసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన మహిళకు కర్నూల్లోని కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. నర్సుబాయి అవయవాలను ఆపదలో ఉన్న ఆరుగురికి దానం చేసి ప్రాణాలను కాపాడుతామని వైద్యులు వెల్లడించారు.