కొత్తకోట, ఏప్రిల్ 23 : ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దగూడెం గ్రామానికి చెందిన నలబోతుల చెన్న మ్మ, కుర్మయ్య దంపతుల కుమార్తె అయిన బా లమణి(24)ని 11 ఏండ్ల కిందట కోడేరు మం డలం రాజాపూర్ గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో వివాహం చేయగా పళ్లైన రెండేళ్లకే బాలమణి భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నది.
ఆరేండ్ల కిందట కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి మామిడి తోటలో పనిచేయడానికి నెలకు రూ.5వేల జీతానికి నియమించా రు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉండి తోట పనులు చేసేది, అప్పుడప్పుడు తల్లిదండ్రుల వ ద్దకు వెళ్లి వచ్చేది. అయితే మంగళవారం సా యంత్రం 6 గంటల సమయంలో బుచ్చిరెడ్డి బాలమణి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతు రు చనిపోయిందని, వచ్చి శవాన్ని తీసుకువెళ్లండని చెప్పారు.
అయితే బాలమణి ఎలా చనిపోయిందని తల్లిదండ్రులు బుచ్చిరెడ్డిని ఆరా తీయ గా సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. దీం తో తమ కూతురు మృతిపై తోట యజమానిపైనే అనుమానం ఉందని బుచ్చిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహించి తమకు న్యాయం చే యాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.