అచ్చంపేట, జనవరి 3 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ. 2లక్షల రు ణమాఫీ చేస్తుంది.. రైతులు బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులైనా ఇంతవరకు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంతవరకు రైతులకు రైతుబంధు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంపై బురదచ ల్లి తాత్సారం చేస్తుందన్నారు. గ్రామాల్లో కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయని, జనవరి నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మ హిళలకు పెంచి ఇస్తామన్నా ఆసరా పింఛన్లు ఏమయ్యాయన్నారు.
ఆరుగ్యారెంటీలు అమలు చేయలేక పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావిడిగా ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తు లు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కౌ లు రైతుల పరిస్థితి ఏమిటని, రైతుబంధును రైతులు, కౌలు రైతులలో ఎవరికి ఇస్తారో సృష్టం చేయాలన్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే త పన తప్పా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే పట్టుదల వారిలో కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ నై జం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని, వం ద రోజుల్లో ఆరు గ్యారంటీలతోపాటు హామీలను అ మలు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. నెలరోజుల కాంగ్రె స్ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార న్నారు. సమావేశంలో ఎంపీటీసీ తిరుపతయ్య, అ మీనొద్ద్దీన్, సర్పంచ్ లోక్యానాయక్, జెడ్పీటీసీ రాం బాబు, కౌన్సిలర్ రమేశ్, కుత్బుద్దీన్, రాజేశ్వర్రెడ్డి, రాజారాంగౌడ్, నర్సింహ, బాలరాజు, రేణయ్య, సింగిల్విండో చైర్మన్ నర్సయ్య, సతీశ్, తిరుపత య్య, వెంకటయ్య, సర్పంచ్ శ్రీరాంనాయక్ ఉన్నారు.