నాగర్‌కర్నూల్, అక్టోబర్ 22 : యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చే స్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై ఎంపీ మల్లురవి అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ విద్య, నైపుణ్యంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యువత స్వయం ఉపాధి లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతోపాటు యువతకు ఉద్యోగ కల్పనపై అవగాహన కల్పించేందుకు రూ.50లక్షల నిధులతో క్యాం పులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేలా సమాచారాన్ని పుస్తక రూపంలో రూ పొందించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్ మల్లురవి మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీ న వర్గాల యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. నెల రోజుల తర్వాత డీసీసీబీ ఆధ్వర్యంలో రూ.150కోట్లతో నాగర్‌కర్నూల్‌లో లోన్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజే శ్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారె డ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధ్దన్‌రెడ్డి, మైనార్టీ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి కకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కేం ద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.