మహబూబ్ నగర్ : మహాత్మ జ్యోతిబా ఫూలే (Phule) ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం, పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్ లో ఫూలే విగ్రహానికి ఎమ్మల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారవుతారని నమ్మిన వ్యక్తి ఫూలే అని వెల్లడించారు. బ్రిటిష్ కాలంలోనే ( British Rule ) భారతీయ పిల్లలు చదువుకోవాలని సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించారని, బడుగు, బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని వివరించారు. విద్య మీద ప్రజా ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే దానికి స్ఫూర్తి జ్యోతిబాపూలేనని అన్నారు .
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ( Collector Vijayendira Boi ) మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, కుల వివక్షత, మహిళ విద్యకు కృషి చేసిన జ్యోతిబాపూలే మహానీయుడని అన్నారు . వారి త్యాగాల ఫలితంగానే సమాజంలో మార్పులు వచ్చాయని, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు.
ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ గ్రూప్ 1 లో ఎంపిక అయినందుకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర, డీపీఆర్వో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్లో..
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతటి రజిత ( Rajitha ) పూలెచిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శివశంకర్, కృష్ణ, వెంకటేష్, వేరుశెనగ కొనుగోలు వ్యాపారస్తులు, కమిషన్ దారులు . నాయకులు రాజ్ గోపాల్, రాములు, జగదీశ్వర్, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.