May Day | కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా ఏకం కావాలి
May Day | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు.
మాగనూర్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని సీఐటీయూ ( CITU ) నాయకులు ఆరోపించారు. మేడే ( May day ) ఉత్సవాల సందర్భంగా మాగనూరు మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భరత్ కుమార్ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 సంవత్సరాల క్రితం నుండి బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దుచేసిందని ఆరోపించారు. కొత్తగా 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.
కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమయ్యే హక్కు , కనీస వేతనం అడిగే హక్కు, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోకుండా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మక్తల్ ఏరియా కార్యదర్శి పుంజనూర్ ఆంజనేయులు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కోల్పూర్ నర్సింలు , బోయ రవి, ముష్టి వెంకటయ్య ,డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు బాలరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వాకిటి వెంకటయ్య, ఆంజనేయులు, ఈడిగే రాజు, హమాలి యూనియన్ నాయకులు లంగటి శేఖర్, బ్యాగరి వాబయ్య, దాసరపల్లి అశోక్, కేవీపీఎస్ మండల నాయకులు బి నర్సింలు, వాకిటి హనుమంతు, పాటిమీద ఆనంద్ , తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

